బ్రెగ్జిట్‌కు ఆమోదం..నేటి రాత్రి నుండి ఈయూతో తెగదెంపులు చేసుకుంటున్న బ్రిటన్
- December 31, 2020
లండన్: యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ బంధానికి మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. నేటి రాత్రి 11 గంటల తర్వాత నుంచి బ్రెగ్జిట్ అమల్లోకి రాబోతోంది. ఈయూతో తెగదెంపులు చేసుకుంటూ తీసుకొచ్చిన బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ నిన్న ఆమోదం తెలిపింది. నేటి రాత్రితో ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమిస్తుండడంతో యూనియన్‌లోని ఇతర దేశాల్లా బ్రిటన్‌కు ఇకపై ఎటువంటి వెసులుబాట్లు ఉండవు.
నిజానికి ఈయూలో ఉండడం వల్ల తమకు ఎటువంటి లాభం లేకపోగా, ఆర్థిక భారం పెరుగుతోందని భావించిన బ్రిటన్ బ్రెగ్జిట్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఈయూ నుంచి వైదొలగాలా? వద్దా? అనే విషయంపై 2016లో అప్పటి ప్రధాని డేవిడ్ కామెరూన్ రెఫరెండం నిర్వహించారు. అందులో 52 శాతం మంది బ్రెగ్జిట్‌కు ఓటేశారు. ప్రజాతీర్పు తనకు వ్యతిరేకంగా రావడంతో కామెరూన్ తన పదవికి రాజీనామా చేశారు.
నిజానికి 29 మార్చి 2019 నాటికే బ్రెగ్జిట్ పూర్తికావాల్సి ఉండగా, బ్రిటన్ పార్లమెంటు ఆమోదం లభించకపోవడంతో కామెరూన్ తర్వాత పదవి చేపట్టిన థెరెసా మే కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత బోరిస్ జాన్సన్ రావడంతో బ్రెగ్జిట్‌పై అడుగుముందుకు పడింది. తాజాగా, బ్రెగ్జిట్‌ను పార్లమెంటు ఆమోదించడంతో నేటి రాత్రి నుంచి ఈయూతో ఉన్న అనుబంధానికి అధికారికంగా తెరపడనుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష