నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్
- December 31, 2020ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ నూతన సంవత్సరం ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. 2021 నూతన సంవత్సరం ఆగమనం నేపధ్యంలో గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి తాజా పోకడలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలు తమ వేడుకలను జరుపుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించాలని, నూతన సంవత్సర వేడుకలను సంయమనంతో జరుపుకోవాలని గౌరవ గవర్నర్ హరిచందన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రతి సంవత్సరం నూతన సంవత్సర తొలి రోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో రాష్ట్ర ప్రజలు గవర్నర్ ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షాలు తెలపటం అనవాయితీ కాగా, కరోనా నేపధ్యంలో ఈ విడత ఆకార్యక్రమానికి రాజ్ భవన్ దూరంగా ఉండనుందని గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?