కొత్త మెట్రో స్టేషన్లతో వేలాది మంది రెసిడెంట్స్, ప్రాపర్టీ ఇన్వెస్టర్స్కి లబ్ది
- December 31, 2020
దుబాయ్: పదుల సంఖ్యలో ఇన్వెస్టర్లకూ, వేల సంఖ్యలో రెసిడెంట్స్కీ, కొత్త దుబాయ్ మెట్రో స్టేషన్లతో లబ్ది చేకూరుతుందని, నఖీల్ కమ్యూనిటీల్లోని వారికి ప్రత్యేకించి అనూహ్యమైన లబ్ది జరుగుతుందని మాస్టర్ డెవలపర్ నఖీల్ పేర్కొంది. జనవరి 1 నుంచి కొత్త మెట్రో స్టేషన్లు తెరచుకోనున్నాయి. జబెల్ అలి, ది గార్డెన్స్, డిస్కవరీ గార్డెన్స్ అలాగే అల్ ఫుర్జాన్లలో మెట్రో స్టేషన్లు జనవరి 1 నుంచి అందుబాటులోకి రానున్న విసయం విదితమే. నఖీల్కి చెందిన అల్ ఫుర్జాన్, డిస్కవరీ గార్డెన్స్ అలాగే ఆర్డెన్స్ కమ్యూనిటీ మ్తొంగా 1,000 హెక్టార్లలో విస్తరించి వుంది. సుమారు 95,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. రూట్ 2020 విస్తరణలో భాగంగా ఆర్టిఎకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్లు నఖీల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అకిల్ కాజిమ్ చెప్పారు. మెట్రో స్టేషన్ నుంచి నడిచేందుకు వీలున్నంత దూరంలో ప్రాపర్టీస్ అమ్మకాలు, అద్దెలు విపరీతంగా పెరిగినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష