గ్లోబల్ ప్రవాసీ రిష్తా పోర్టల్ మరియు మొబైల్ యాప్ ప్రారంభం
- December 31, 2020
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిసెంబర్ 30న గ్లోబల్ ప్రవాసీ రిష్తా పోర్టల్(http://www.pravasirishta.gov.in/) అలాగే యాప్‌ని ప్రారంభించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా వున్న 3.12 కోట్ల మంది భారతీయుల కోసం వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ మాట్లాడుతూ, ఇండియన్ మిషన్స్ అలాగే మినిస్ట్రీ, ఇండియన్ డయాస్పోరా మధ్య మూడు కోణాల్లో కమ్యూనికేషన్ కోసం వీటిని ప్రారంభించినట్లు చెప్పారు. విదేశాల్లో వుంటోన్న మొత్తం 3.12 కోట్ల మంది భారతీయుల్లో 1.78 మంది ఎన్నారైలు కాగా, 1.34 కోట్ల మంది పిఐఓలు. ప్రతి విషయంలో విదేశాల్లోని భారతీయులతో సంప్రదించేలా, వారితో ఆలోచనల్ని పంచుకునేలా ఈ ప్రవాసీ రిష్తా పోర్టల్‌ని ప్రారంభించినట్లు చెప్పారు మంత్రి. ఇండియన్ డయాస్పోరా మెంబర్స్ (పీఐఓలు, ఎన్నారైలు, ఓసీఐలు) రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా పోర్టల్‌ని ప్రారంభించారు. ఎలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్ అయినా, సహాయ సహకారాలు అందించేలా ఈ పోర్టల్, యాప్ ఉపకరిస్తాయి. పాస్‌పోర్ట్, వీసా సహా ఇతర కాన్సులర్ సేవలకు సంబంధించి కూడా ఇక్కడ ఉపయోగకరమైన సమాచారం లభిస్తుంది. ఇప్పటిదాకా ఈ తరహా సమాచార వ్యవస్థ ఏదీ లేకపోవడంతో, ఈ కొత్త విధానం విదేశాల్లో వున్న భారతీయులకీ, వారికి టచ్‌లోకి వెళ్ళేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకీ ఉపయుక్తంగా వుంటుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష