కువైట్ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు షురూ..

- January 02, 2021 , by Maagulf
కువైట్ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు షురూ..

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసుల రాకపోకలు ఎట్టకేలకు పునరుద్దరించారు. బ్రిటన్ లో కోవిడ్ 19 స్ట్రెయిన్ రూపాంతరం చెందటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమాన సర్వీసులను 10 రోజుల క్రితం రద్దు చేశారు. అయితే..నిషేధాన్ని తొలిగించి విమానాల రాకపోకలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో విదేశాల్లో చిక్కుకుపోయిన కువైటీస్ సంతోషం వ్యక్తం చేశారు. సర్వీసుల పునరుద్ధరణ తర్వాత తొలి రోజు ఇస్తాంబుల్ నుంచి తుర్కిష్ ఎయిర్ లెన్స్ లో 150 కువైటీయన్లు స్వదేశానికి చేరుకున్నారు. ఇక కువైట్ నుంచి ఫస్ట్ ఫ్లైట్ దోహాకు టేకాఫ్ అయ్యింది. తొలి రోజున మొత్తం 60 విమానాలు నడిచాయి. ఇదిలాఉంటే విమానాల రద్దు సమయంలో పలు దేశాల్లో చిక్కుకుపోయిన కువవైటీయన్లను స్వదేశానికి తీసుకొచ్చేందుకు శనివారం నాలుగు విమానాలను నడిపినట్లు అధికారులు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com