అబుధాబి: కొత్త ఏడాదిలో అమల్లోకి వచ్చిన టోల్ ఛార్జ్

- January 02, 2021 , by Maagulf
అబుధాబి: కొత్త ఏడాదిలో అమల్లోకి వచ్చిన టోల్ ఛార్జ్

అబుధాబికి వచ్చే నాలుగు వంతెనలపై నుంచి ప్రయాణించే వాహనదారులకు టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. కొత్త ఏడాది నుంచి రద్దీ సమయం 7 నుంచి 9 గంటల వరకు టోల్ విధిస్తామని ప్రభుత్వం ముందుగానే చెప్పిన విషయం తెలిసిందే. ఈ నాలుగు టోల్ గేట్లలో Dh4 టోల్ ఛార్జ్ చేస్తున్నారు. డర్బ్ టోల్ సిస్టమ్ అకౌంట్ లో రిజిస్టర్ అయిన వాహనదారులు అందరికీ పీక్ అవర్స్ లో Dh4 అటోమెటిగ్గా కట్ అవుతాయి. అబుధాబికి వచ్చే దుబాయ్-సేక్ జయద్ బ్రిడ్జి, షేక్ ఖలీఫా బిన్ జయద్ బ్రిడ్జి, అల్ మక్తా బ్రిడ్జి, ముసఫ్పా బ్రిడ్జి మీదుగా ప్రయాణించే వాహనదారులు అంతా టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com