రెసిడెన్సీ పర్మిట్ సర్వీసులపై ఫీజు వసూలు మళ్లీ ప్రారంభం

- January 02, 2021 , by Maagulf
రెసిడెన్సీ పర్మిట్ సర్వీసులపై ఫీజు వసూలు మళ్లీ ప్రారంభం

 బహ్రెయిన్: ఇక నుంచి రెసిడెన్సీ అనుమతులకు సంబంధించి ఎలాంటి సేవలు పొందాలన్న ఫీజు చెల్లించాల్సి ఉంటుందని బహ్రెయిన్ ప్రకటించింది. జాతీయ పాస్ పోర్టు, నివాస అనుమతి వ్యవహారాల అధికార విభాగం ఈ మేరకు ప్రకటించింది. కోవిడ్ ఆంక్షలు, అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇబ్బందుల కారణంగా ఇచ్చిన మినహాయింపులు డిసెంబర్ 31తో పూర్తయినట్లు వెల్లడించింది. అయితే..టూరిస్ట్ వీసా గడువు ఈ నెల 21 వరకు ఉందని, అయితే..రెసిడెన్సీ అనుమతులకు సంబంధించి నివాస అనుమతుల రద్దుగానీ, రెన్యూవల్ చేసుకున్న ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com