ఖతార్ లో పెరుగుతున్న కరోనా రికవరి రేటు
- January 02, 2021
ఖతార్ కరోనా రికవరి రేటు పెరుగుతోంది. శనివారం కొత్తగా మరో 124 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,41,680 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 198 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల్లో 173 కమ్యూనిటీ కేసులు ఉండగా..25 మంది విదేశాల నుంచి తిరిగొచ్చిన వారు ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 1,44,240 మంది వైరస్ బారిన పడగా..ప్రస్తుతం 2,315 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 245 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ వివరించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







