యువకుడిని మోసం చేసిన దంపతులు...అరెస్ట్ చేసిన రాచకొండ పోలీస్
- January 02, 2021
హైదరాబాద్: ఓ వెబ్‌సైట్‌లో నకిలీ ప్రొఫైల్ పెట్టి యువకుడిని మోసం చేసిన దంపతులు ఏకంగా రూ.21లక్షలు దోచుకున్నారు. యువకుడు అందించిన ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అ దంపతులను అరెస్టుచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన కంపా హృదయానంద్ అనే యువకుడు 2017లో అనూష అలియాస్ హారిక అనే యువతిని పెండ్లి చేసుకున్నారు. అనంతరం హృదయానంద్ అనారోగ్యం పాలవడంతో ఏ పనీ చేయలేకపోవడంతో హారిక హైదరాబాద్‌లోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పనిచేస్తుంది. చాలీచాలని సంపాదనతో సంతృప్తి చెందక ఆన్‌లైన్ మోసాలకు పథకం వేశారు. హారికా హృదయానంద్ అనే పేరుతో ఓ ఫేక్ ప్రొఫైల్ తయారుచేసి గుర్తుతెలియని అందమైన యువతి ఫొటోతో ఇండియన్ డేటింగ్.కామ్ అనే వెబ్‌సైట్‌లో పోస్టుచేశారు. నేరెడ్‌మెట్‌కు చెందిన డోనాల్డ్ హోరసీస్ రోజారియో అనే వ్యక్తి చాటింగ్ మొదలెట్టాడు. హృదయానంద్ తాను యువతిలా చాటింగ్ చేయడం ప్రారంభించాడు. చివరకు గుండె జబ్బుతో బాధపడుతున్న తన తల్లి ఆపరేషన్ కోసం డబ్బు కావాలని కోరింది. అతను ఆన్‌లైన్‌లో డబ్బు పంపాడు. మరికొన్ని రోజుల తర్వాత తల్లి మరణించిందని, తన సోదరి సర్జరీ చేయించాలని పలుమార్లు డబ్బు అడిగింది. ఇలా పలు దఫాలుగా డోనాల్డ్ రూ.21లక్షలు ఆమెకు ఆన్‌లైన్‌లో పంపాడు. ఆ తర్వాత కూడా పెళ్లిని వాయిదా వేస్తూ రావడంతో అనుమానించిన డోనాల్డ్ రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విజయవాడకు వెళ్లి నిందితులను పట్టి తెచ్చారు. శుక్రవారం ఇద్దరిని రిమాండుకు తరలించారు. పెళ్లి విషయంలో ఆన్‌లైన్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సైబర్‌క్రైమ్ ఏసీపీ హరినాథ్ నెటిజన్లకు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







