కిడ్నీలో రాళ్లు కరిగిపోవడానికి అద్భుత ఇంటి చిట్కాలు

- January 03, 2021 , by Maagulf
కిడ్నీలో రాళ్లు కరిగిపోవడానికి అద్భుత ఇంటి చిట్కాలు

మీరు కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడుతున్నారా ? వాటిని తొలగించాలంటే కొన్ని జీవనశైలి మార్పులతో తొలగించడం లేదా తగ్గించడం చేయగలరు. మూత్రపిండాల లోపలి పొరలో, పేరుకున్న ఖనిజాలు కిడ్నీలో రాళ్ళుగా మారుతాయి. కిడ్నీలో కాల్షియం, పొటాషియం వంటివి పేరుకుపోవడం మూలంగా ఇది జరుగుతుంది. మీకు కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లుగా లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించి రోగనిర్ధారణ చేసుకోండి. కొన్ని గృహ చిట్కాలతో వీటిని ఎలా విచ్ఛిన్నంచేసి, బయటకు పంపవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండబెట్టిన తులసి ఆకులను కొద్దిగా వేడినీటిలో వేసి, ఆ టీని రోజులో మూడుసార్లు తీసుకోండి. ఇది ఎసిటిక్ ఆమ్లంగా మారి మూత్రపిండాలలో రాళ్ళను విచ్ఛిన్నం చేయడానికి మీకు సహాయపడుతుంది.
దానిమ్మ పండు రసాన్ని క్రమంతప్పకుండా తీసుకోవడం ద్వారా, మూత్రపిండాల్లో రాళ్లను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

కిడ్నీ బీన్స్ లోని ఫైబర్ కిడ్నీలో రాళ్లను కరిగించడం లేదా విచ్చిన్నం చేయడంలో సహాయపడతాయి. నానబెట్టిన (8-12 గంటలు) కిడ్నీ బీన్స్ ను, కొద్దిగా ఇంగువతో ఉడకబెట్టి తీసుకోండి. మూత్రపిండంలోని రాళ్లను తగ్గించడానికి రోజుకు ఒక్కసారైనా వీటిని తీసుకోవడం మంచిది.

డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని అనేక పరిశోధనల్లో తేలిన నిజం. కాబట్టి కిడ్నీలో రాళ్లను నివారించడానికి మీరు తగినంత నీటిని తీసుకోవాలి. వీలయితే గంటకు కనీసం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకునేలా ప్లాన్ చేసుకోండి.

నిమ్మకాయలో ఉండే సిట్రేట్ కిడ్నీలో రాళ్లను విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నిమ్మకాయ నీళ్ళు మూత్రపిండాలలోని రాళ్ళను బయటకు పంపడానికి సహాయపడే అద్భుతమైన నివారణగా సూచించబడుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ శరీరంలో ఎసిటిక్ ఆమ్లంగా మారుతుంది. ఇది రాళ్ళను విచ్ఛిన్నం చేస్తుంది. లంచ్ / డిన్నర్ కు 30 నిమిషాల ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలలో రాళ్లను విచ్ఛిన్నం చేసి వాటిని బయటకు పంపడానికి సహాయం చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com