తారకరత్న మరోసారి విలన్‌గా...
- February 22, 2016
'ఒకటో నెంబర్ కుర్రాడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు నందమూరి తారకరత్న. సోమవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా నారా రోహిత్ సోషల్‌మీడియా ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తారకరత్నను బావా అని సంభోదిస్తూ... ఆయనకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి ఫేమ్‌లో వస్తున్న 'రాజా చెయ్యివేస్తే' చిత్రం సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. తారకరత్న ఈ చిత్రంలో విలన్‌గా కనిపించనున్నట్లు వెల్లడించారు. గతంలో తారకరత్న 'అమరావతి' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు.ఈ చిత్రానికి గానూ ఆయనకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డు లభించింది. నారా రోహిత్, తారకరత్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'రాజా చెయ్యివేస్తే'. ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రంలో తారక్ విలన్‌గా ప్రేక్షకులను ఎలా అలరించనున్నారో వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







