భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
- January 03, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.ప్రస్తుతం కేసులు 20 వేలకు దిగువున నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గుతున్నా, కొత్త కరోనా స్ట్రెయిన్ భయం కారణంగా నిబంధనలు కొనసాగిస్తున్నారు.భారత ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 18,177 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,23,965కి చేరింది.ఇందులో 99,27,310 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,44,220 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 217 మంది మృతి చెందారు.దీంతో భారత్లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,49,435కి చేరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







