విదేశీ కార్మికులకు ఒమాన్ శుభవార్త

- January 03, 2021 , by Maagulf
విదేశీ కార్మికులకు ఒమాన్ శుభవార్త

మస్కట్:కోవిడ్ సంక్షోభం, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల కారణంగా విదేశీ కార్మికులకు ఒమాన్ గుడ్ న్యూస్ అందించింది. విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీ కార్మికులు తమ గుర్తింపు కార్డుల గడువు ముగిసినట్లైతే ఇక నుంచి వాటిని రెన్యూవల్ చేసుకోవచ్చని ప్రకటించింది. పలు ఫ్యాక్టరీలు, కంపెనీలలో కార్మికుల కొరతను అధిగమించేందుకు ఒమాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహమ్మారి గడ్డు కాలాన్ని ఎదుర్కొని ఆర్ధిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఒమన్ ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి పలు వెసులుబాట్లు కల్పిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా కార్మికుల కొరతను తీర్చేందుకు గుర్తింపు కార్డులను రెన్యూవల్ చేసుకోని వారికి జరిమానాలను కూడా రద్దు చేసింది. అలాగే సంక్షోభ సమయంలో గడువు ముగిసిన కంపెనీల అనుమతులను కూడా మరికొన్నాళ్లు పొడిగించింది. కంపెనీలు కార్మికులను వేగంగా భర్తీ చేసుకునేందుకు విదేశీయులకు తాత్కాలిక వీసాలను మంజూరు చేసేందుకు ఓకే చెప్పింది. అంతేకాదు..ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు ఉన్న యాజమాన్యాలు...తమ కార్మికులను అవసరం మేరకు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అవసరం అనుకుంటే వేరే యాజమాన్యాల ఆధ్వర్యంలోని కంపెనీల నుంచి లిఖిత పూర్వక ఒప్పందం ద్వారా కార్మికులను అద్దెకు తీసుకునే స్వేచ్ఛను ఇచ్చినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఒమాన్) 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com