సౌదీ అరేబియాలో అగ్ని ప్రమాదం..ముగ్గురు సజీవ దహనం
- January 03, 2021
రియాద్:సౌదీ అరేబియాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు చిన్నారులు సజీవ దహనం అయ్యారు. తల్లితో పాటు మరో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. అబు అరిష్ గవర్నరేట్ పరిధిలోని జిజాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు అంతస్తుల ఇంట్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో చనిపోయిన వాళ్లంతా మూడు నుంచి ఎనిమిదేళ్ల లోపు పిల్లలు. ప్రమాదం గురించి సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే..మంటలు ఎలా వ్యాపించాయనేది ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







