యూఏఈ: కొత్త ఏడాదిలో ఆకాశంలో తొలి అద్భుతం..
- January 03, 2021
యూఏఈ:కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నట్లు ఆకాశం మిరుమిట్లు గొలుపనుంది. జనవరి 3 రాత్రి నుంచి మరుసటి రోజు వరకు ఆకాశంలో ఉల్కాపాతం సంభవించనుంది. ఈ ఏడాదిలో ఇదే తొలి ఉల్కపాతం కావటం విశేషం. అంతేకాదు..ఈ ఏడాదికి ఇదే అత్యుత్తమ ఉల్కపాతం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. తొలిగా కొద్ది మేర మాత్రమే ఉల్కపాతం సభవించే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే..లాస్ట్ అవర్స్ లో మాత్రం గరిష్ట స్థాయిలో చూసేందుకు వీలుంటుంది. పీక్ అవర్స్ లో గంటకు 60 నుంచి 120 వరకు చూడవచ్చని నాసా స్పష్టందద చేసింది. ఆకాశంలో తారాజువ్వల్లా మిరుమిట్లు గొలుపుతో దూసుకుపోయే తోక చుక్కల నిప్పుల వర్షాన్ని చూసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పని లేదు. ఆకాశంలో మేఘాలు లేకుండా నిర్మలంగా ఉంటే మనం తోక చుక్కల ఉల్కాపాతాన్ని ఆస్వాదించవచ్చు. అయితే..ఏ దిశలో ఉల్కపాతం జరుగుతుందో ముందే నిర్దారించుకొని కుర్చిలోగాని, వెల్లకిలా పడుకొనిగానీ ఆకాశాన్ని గమనిస్తూ ప్రకృతిని ఆస్వాదించటమే మనం చేయాల్సిన పని. పదిహేను నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు అలా గమనిస్తుంటే ఉల్కాపాతాన్ని నేరుగా చూడొచ్చు. మరింత స్పష్టంగా చూడాలనుకునేవారు సిటీ లైట్ల వెలుతురుకు దూరంగా వెళ్లి చూస్తే మరింత క్లారిటీగా ఉంటుంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్‌లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!









