ఆర్టిసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు..

- February 22, 2016 , by Maagulf
ఆర్టిసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు..

ఆర్టిసీ ప్రయాణికులకు మంచి శుభవార్త తెలిపింది..ఆర్టిసీ బస్సులో చివరి సీట్లలో ప్రయాణించే వారికి టిక్కెట్ ధరలో 20 శాతం రాయితీ ఇవ్వనున్నారు. డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్, అమరావతి దూరప్రాంత సర్వీసుల్లోని చివరి రెండు వరసల్లో ఉండే తొమ్మిది సీట్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. అడ్వాన్స్ రిజర్వేషన్‌తోపాటు కరెంట్ రిజర్వేషన్ చేయించుకున్నప్పుడూ ఇది వర్తించనుంది.అంతేకాదు 250 కిలోమీటర్లకు మించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినవారికి ఆ తర్వాత రెండు గంటలపాటు సమీప ప్రాంతాలకు సిటీబస్సులు, జిల్లా సర్వీసుల్లో (తెలుగు వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు) ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com