ఉచితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన అబుధాబి ఆరోగ్య శాఖ
- January 05, 2021అబుధాబి:కోవిడ్ 19ని సమూలంగా అరికట్టేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న అబుధాబి ఆరోగ్య శాఖ యంత్రాంగం..కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ను ప్రారంభించింది. కింగ్డమ్ పరిధిలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించింది. వ్యాక్సిన్ దుష్ఫ్రభావాలపై ప్రజల్లో ఇంకా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశారు అధికారులు. సమాజంలోని ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవటం మంచిదని పిలుపునిచ్చారు. క్లినికల్ ట్రయల్స్ లో విజయవంతమైన ఫలితాలు సాధించిన తర్వాతే తాము వ్యాక్సిన్ కు అనుమతులు ఇచ్చిన విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. కోవిడ్ 19 పరివర్తనం చెందుతూ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు తమ బాధ్యతగా వ్యాక్సిన్ తీసుకోని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలన్నారు. దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం తమ బాధ్యతగా దేశ ప్రజలు అందరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తారని నమ్ముతున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం