ఈ నెలాఖరు వరకు భారత్-ఒమన్ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం పొడిగింపు

- January 05, 2021 , by Maagulf
ఈ నెలాఖరు వరకు భారత్-ఒమన్ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం పొడిగింపు

మస్కట్:భారత్-ఒమాన్ మధ్య కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ ఒప్పందం ఈ నెలాఖరు వరకు పొడిగించారు.ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ 19 నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులపై నిషేధం డిసెంబర్ 31తో ముగిసింది. అయితే స్ట్రెయిన్ నేపథ్యంలో ఈ ఆంక్షలను జనవరి 31వరకు పొడిగిస్తున్నట్లు భారత పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. అయితే..అంతర్జాతీయ కార్గో విమానాలకు ఈ ఆంక్షలు వర్తించవని వెల్లడించింది. అదేవిధంగా వందే భారత్ మిషన్ ఫ్లైట్స్, ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకున్న దేశాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు స్పష్టం చేసింది. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com