వచ్చి పోయే ప్రయాణీకులకు కొత్త నిబంధనలు
- January 05, 2021
కువైట్ సిటీ:కరోనా వైరస్ న్యూ స్ట్రెయిన్ ఆందోళనల నేపథ్యంలో డిసెంబర్ 21 నుంచి నిలిచిపోయిన రాకపోకల్ని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జనవరి 2 నుంచి పునఃప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో సరికొత్త నిబంధనల్ని వచ్చి పోయే ప్రయాణీకుల కోసం రూపొందించి, అమల్లోకి తెస్తున్నారు. డిజిసిఎ విడుదల చేసిన కొత్త ప్రకటనను బట్టి, విమానాశ్రయంలో ప్రయాణీకులందరికీ పిసిఆర్ టెస్ట్ తప్పనిసరిగా చేస్తారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళుతున్నవారంతా కువైట్ మోసాఫెర్(MOSAFER) యాప్‌లో తమ వివరాల్ని రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. కువైటీ ప్రయాణీకులు హెల్త్ ఇన్స్యూరెన్స్ పొందడంతోపాటు, కువైట్ మోసాఫిర్ ద్వారా ప్రతిజ్న కూడా చేయాల్సి వుంటుంది. నకువైటీలకు, వారి ఫస్ట్ డిగ్రీ బంధువులకు, డొమెస్టిక్ వర్కర్స్‌కు కూడా కువైట్ ఎయిర్‌వేస్ కార్పరేషన్, రిజర్వేషన్ సౌకర్యం (విదేశాల్లో చిక్కుకుపోయినవారికి) కల్పిస్తోంది. అయితే, కరోనా హైరిస్క్ కేటగిరీలో పొందుపర్చబడ్డ 35 దేశాల నుంచి డైరెక్ట్ ఎంట్రీ పై మాత్రం బ్యాన్ కొనసాగుతుందని మినిస్ట్రీ వివరించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష