రస్‌ అల్‌ ఖైమాలో సెక్యూరిటీ కెమెరాలు

- February 22, 2016 , by Maagulf
రస్‌ అల్‌ ఖైమాలో సెక్యూరిటీ కెమెరాలు

క్రైమ్‌ రేట్‌ తగ్గించడానికీ, అలాగే భద్రత పెంచడానికి అధికారులు ఎమిరేట్‌ వ్యాప్తంగా సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమైన భవనాలు, పబ్లిక్‌ స్పేసెస్‌ మరియు, స్ట్రీట్స్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు ధృవీకరించారు. 40,000 ఎస్టాబ్లిష్‌మెంట్స్‌, వీటిల్లో ఎక్కువగా ఫెడరల్‌ మరియు లోకల్‌ గవర్నమెంట్‌ బిల్డింగ్స్‌ ఇక నుంచి క్లోజ్డ్‌ సర్క్యూట్‌ కెమెరాల పర్యవేక్షణలోకి వెళ్ళనున్నాయి. వారంలో ఏడు రోజులు, రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ కెమెరాలు పనిచేస్తాయి. రస్‌ అల్‌ ఖైమా కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ అలీ అబ్దుల్లా బిన్‌ అల్‌వాన్‌ అల్‌ నువామి ఈ వివరాల్ని వెల్లడించారు. 18 నెలల్లో ఈ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని ఆయన అన్నారు. రస్‌ అల్‌ ఖైమా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ షేక్‌ సౌద్‌ బిన్‌ సక్ర్‌ అల్‌ కాసిమి డైరెక్షన్‌లో ఈ ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకుందని చెప్పారాయన. కెమెరాల్లో చిత్రీకరించిన విజువల్స్‌ని 90 రోజులపాటు నిక్షిప్తం చేసేందుకూ తగిన ఏర్పాట్లున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు పోలీసులు మాత్రమే ఈ కెమెరాల్లోని విజువల్స్‌ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com