‘గ్రామీ’ అవార్డుల వేడుక వాయిదా
- January 06, 2021_1609915152.jpg)
అమెరికా:కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం ఎలాంటిదో ప్రత్యేంగా చెప్పాల్సిన అవసరం లేదు.కంటికి కనిపించని వైరస్ కారణంగా యావత్ ప్రపంచం గడగడలాడిపోయింది. ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఈ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. కొన్నయితే రద్దు అయ్యాయి.ఇక ప్రస్తుతం పరిస్థితులు కాస్త సర్దుకుంటున్నాయన్న సమయంలో బ్రిటన్ కేంద్రంగా పుట్టుకొచ్చిన స్ట్రెయిన్ కరోనా మళ్లీ అలజడి రేపుతోంది. ఈ క్రమంలోనే కొన్ని దేశాలు మళ్లీ లాక్డౌన్ దిశగా వెళుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికాలోనూ పరిస్థితుల మళ్లీ చేయి దాటుతోన్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవాన్ని వాయిదా వేశారు.జనవరి 31న జరగాల్సిన ఈ అవార్డు వేడుకలను వాయిదా వేశామని గ్రామీ అవార్డు నిర్వాహకులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. పరిస్థితులు మెరుగయ్యాక మార్చి 14న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ అవార్డుల వేడుక జరగనుండగా ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష