‘శూర్పణఖ’ లో పురావస్తు శాస్త్రవేత్తగా రెజీనా
- January 06, 2021
హైదరాబాద్:హీరోయిన్ రెజీనా, అడవి శేష్ నటించిన ‘ఎవరు’ సినిమా తర్వాత ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే.. తాజాగా ‘శూర్పణఖ’గా మరి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రెజీనా. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తోంది రెజీనా. ఈ సినిమాకు తెలుగులో ‘నేనేనా’ అనే టైటిల్ పరిశీలిస్తుండగా.. తమిళంలో ‘శూర్పణగై’ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా పరిశోధన ఆసక్తికరమైన సంఘటనలకు దారి తీస్తుందట. ఆ తర్వాత నుంచి ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే మలుపులతో సినిమా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు