సౌదీ:రిజిస్ట్రేషన్ తర్వాత 48 గంటల్లో తర్వాత వ్యాక్సినేషన్

- January 06, 2021 , by Maagulf
సౌదీ:రిజిస్ట్రేషన్ తర్వాత 48 గంటల్లో తర్వాత వ్యాక్సినేషన్

రియాద్:కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్న వారికి తమ పేర్లు నమోదు చేసుకున్న 48 గంటల్లోనే అపాయింట్మెంట్ ఖరారు చేస్తున్నట్లు సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అపాయింట్మెంట్ వివరాలను స్మార్ట్ ఫోన్ యాప్ లేదా రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ కు పంపిస్తున్నట్లు వివరించారు. ఫైజర్-బయోన్టెక్ వ్యాక్సిన్ కు అత్యవసర అమోదం లభించిన తర్వాత...గత నెల నుంచే సౌదీలో వ్యాక్సినేషన్ చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే..తమంతట తాముగా ముందుకు వచ్చిన వారిన పౌరులు, ప్రవాసీయులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. 65 ఏళ్లు నిండిన వారికి, ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఉబకాయులు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారికి తొలి ప్రధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. http://onelink.to/yjc3njలింకు ద్వారా స్మార్ట్ ఫోన్ యాప్ 'Sehhaty'లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ కోసం కింగ్డమ్ పరిధిలోని రియాద్ లో 550 ఆరోగ్య కేంద్రాలు, జెడ్డాలోని కింగ్ జయాద్ అబ్దులాజీజ్ ఎయిర్ పోర్టు ప్రాంతంలో 84, ధహ్రన్ లో 84 ఆరోగ్య కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఈ మూడు కేంద్రాల్లో అంచనాలకు మించి ప్రజలు వ్యాక్సినేషన్ కోసం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే కింగ్డమ్ పరిధిలో మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేస్తామన్నారు. 

--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com