జనవరి 26 వరకు టూరిస్ట్ వీసాలను పొడిగించిన యూఏఈ
- January 06, 2021
యూఏఈ:డిసెంబర్ 19 నుంచి జనవరి 15 మధ్య కాలంలో వీసా గడువు ముగిసిన పర్యాటకులకు యూఏఈ తీపి కబురు అందించింది. దేశ పర్యటనలో ఉన్న పలు దేశాల పర్యాటకుల వీసా గడువును ఈ నెల 26వరకు పొడిగిస్తున్నట్లు విదేశీ వ్యవహారాలు, నివాస అనుమతుల డీజీ కార్యాలయం వెల్లడించింది. యూరప్ దేశాల్లో స్ట్రెయిన్ కలకలంతో ప్రయాణ అంక్షలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో టూరిస్ట్ వీసాల గడువును నెల పాటు పెంచాలని గత నెల 27నే యూఏఈ ప్రధాని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రధాని ఆదేశాల మేరకు వీసా ఎక్స్టెన్షన్ అమల్లోకి వచ్చినట్లు పలు దేశాల పర్యాటకులకు ఆయా దేశాల ఎంబసీలు, ట్రావెల్ ఏజెంట్లు సమాచారం అందిస్తున్నారు. ఇంకా స్పష్టమైన సమాచారం కావాలనుకునే వారు..డిసెంబర్ 19తో వీసా గడువు ముగిసిన వారు www.amer.ae లింక్ ద్వారా తమ వీసా గడువు పెరిగిందో లేదో తెలుసుకోవచ్చు.
యూఏఈ నిర్ణయం పట్ల పలువురు పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు బిడ్డతో సహా వచ్చిన ఓ కెనడా మహిళా..వీసా పొడిగింపు వార్తను ట్రావెల్ ఏజెంట్ ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. దీంతో తన తిరుగు ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకున్నానని, మరికొద్ది రోజులు తన భర్తతో కలిసి ఉండేందుకు అవకాశం దక్కిందని ఆమె ఆనందంగా చెబుతోంది. మనవరాలిని చూసేందుకు భారత్ నుంచి వెళ్లిన మరో మహిళ కూడా వీసా పొడిగింపుపై ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలె తమకు పుట్టిన సంతానాన్ని చూసేందుకు అమ్మ యూఏఈ వచ్చిందని, వీసా గడువు పెంపుతో మరో మూడు వారాలు మా అమ్మకు మనవరాలితో కలిసి ఉండేందుకు అవకాశం దక్కిందని సంతోషంగా చెప్పింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష