కోవిడ్ నేపథ్యంలో వర్చువల్ గా రిపబ్లిక్ వేడుకలు

- January 06, 2021 , by Maagulf
కోవిడ్ నేపథ్యంలో వర్చువల్ గా రిపబ్లిక్ వేడుకలు

కువైట్: కోవిడ్ 19 నేపథ్యంలో ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకలను వర్చువల్ గా నిర్వహించనున్నట్లు కువైట్ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మహమ్మారి రోజులు కనుక 72వ గణతంత్ర వేడుకలను కోవిడ్ 19 ప్రొటోకాల్ ను అనుసరించి నిర్వహించబోతున్నట్లు వివరించింది. అంతేకాదు..రాయబార కార్యాలయం ప్రాంగణంలోని ఎవరూ గుమికూడవద్దని కూడా స్పష్టం చేసింది. కువైట్ లోని భారతీయులు అందరూ వర్చువల్ ద్వారా రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనాలని కార్యాలయ అధికారులు కోరారు. ఈ నెల 26న జరగబోయే 72వ గణతంత్ర వేడుకల్లో పాల్గొనే వాళ్లంతా ఉదయం 9 గంటల తర్వాత ఆన్ లైన్ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేయవచ్చని...ఆన్ లైన్ లింక్ కోసం రాయబార కార్యాలయ వెబ్ సైట్, అధికార సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తామని వివరించింది. 

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com