ట్రంప్ మద్దతుదారులు సృష్టించిన అలజడి...నలుగురు మృతి
- January 07, 2021
అమెరికా:అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే.. క్యాపిటల్ భవనంలో జరిగిన కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. పోలీసుల కాల్పుల్లో ఓ మహిళ చనిపోగా.. మరో ముగ్గురు ఘర్షణల్లో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు వాషింగ్టన్ డీసీ పోలీసులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ బుధవారం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనకారులను నిలువరించేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించాయి. ఈ క్రమంలో కాల్పలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఒక మరో ముగ్గురు ఘర్షణల్లో గాయపడి మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. క్యాపిటల్ భవనంలో కాల్పుల నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలో మేయర్ మురియెల్ బౌజర్ కర్ఫ్యూ విధించారు. అత్యవరసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ కర్ఫ్యూ 15 రోజుల పాటు కొనసాగనుందని కూడా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







