ఇద్దరు మైనర్ల డిటెన్షన్ పొడిగింపు
- January 07, 2021
కువైట్ సిటీ:ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంప్రదింపులు జరుపుతున్న నేరానికిగాను ఇద్దరు మైనర్లను డిటెన్షన్ చేశారు. దీన్ని పొడిగిస్తూ, న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నిందితుల వద్ద ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కేసు విచారణను జువైనైల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్కి అప్పగించడం జరిగింది. ప్రముఖ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ పబ్జీ ద్వారా ఈ సంప్రదింపులు జరిగినట్లు విచారణలో తేలింది. ఆట సందర్భంగా, ఉద్దేశపూర్వకంగానే నిందితులు, తీవ్రవాద సంస్థతో చేరినట్లు నిర్ధారించారు. పలు దఫాలుగా ఐపిస్తో సంప్రదింపులు జరిగాయనీ, ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో సహకరించాలంటూ శిక్షణ కూడా ఇచ్చారని విచారణలో తేలింది. తొలుత ఓ మైనర్ ఈ ట్రాప్లో పడగా, ఆ తర్వాత ఆ మైనర్, తన స్నేహితుడ్ని కూడా ఇందులోకి లాగినట్లు విచారణలో అధికారులు గుర్తించి, ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!