సౌరవ్ గంగూలీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
- January 07, 2021
కోల్కతా:BCCI అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో జనవరి 2న చేరిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం దాదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. తనకు చికిత్స చేసిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. చికిత్స అనంతరం తాను పూర్తిగా బాగున్నానంటూ గంగూలీ మీడియాకు వెల్లడించారు. కాగా, ఆయన నిన్ననే డిశ్చార్జి కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆయనను వైద్యులు డిశ్చార్చి చేయలేదన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. నేటి నుంచి గంగూలీ ఆరోగ్య పరిస్థితిని ఆయన ఇంట్లోనే వైద్యులు పర్యవేక్షించనున్నారు. గంగూలీ కోలుకోవాలంటూ అంతకుముందు రాజకీయ నేతలు, టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు, ఆయన అభిమానులు ట్విట్లు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!