అమ్యూజ్మెంట్ పార్కుల పునఃప్రారంభంపై హర్షం
- January 07, 2021
దోహా:కరోనా నేపథ్యంలో రిక్రియేషనల్ యాక్టివిటీస్పై లాక్ డౌన్ ఎఫెక్ట్ పడిన దరిమిలా, పార్కులు వంటివాటిని మూసివేసిన విషయం విదితమే. ఎట్టకేలకు వాటిని తెరిచేందుకు మినిస్ట్రీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీస్, అలాగే చిన్నారులు ఈ నిర్ణయం పట్ల హర్సం వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి మూసివేయబడ్డ అమ్యూజ్మెంట్ పార్కుల్లో చిన్నారుల సందడిని చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ (ఎంఎంఈ) డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ పార్క్స్ మొహమ్మద్ అల్ ఖోరి మాట్లాడుతూ, పిల్లలు ఇకపై నిరభ్యంతరంగా పార్కుల్లో ఎంజాయ్ చేయవచ్చని చెప్పారు. అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామనీ, విజిటర్స్ కూడా మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటివి చేయాలని ఆయన సూచించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..