జనవరి 9న 16వ ప్రవాసి భారతీయ దివస్..NRI ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
- January 07, 2021
విదేశాల్లో ఉంటున్న భారతీయులు.. మాతృదేశ అభివృద్ధిలో పోషిస్తున్న పాత్రను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏటా నిర్వహించే ప్రవాసీ భారతీయ దినోత్సవానికి సమయం ఆసన్నమైంది. మహాత్మాగాంధీ 1915, జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగి వచ్చిన సంఘటనను పురస్కరించుకొని ప్రవాసీ భారతీయ దివస్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే..ఈ సారి కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వర్చువల్ గానే కన్వెన్షన్ నిర్వహిస్తున్నారు. జనవరి 9న ఉదయం 9 గంటలకు ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.15 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతారు. ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగాల నడుమ పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో ప్రవాసీయుల పాత్ర, కోవిడ్ సవాళ్లు, ప్రవాసీ భారతీయ సమ్మన్ అవార్డుల వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇక పీబీడీకి ముందు రోజున(జనవరి 8) ప్రీ-పీబీడీ యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఫేస్ బుక్ తో పాటు యూట్యూబ్ లోనూ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ పీబీడీ ప్రత్యేక అథితిగా పాల్గొంటారు. కేంద్రమంత్రులు కిరన్ రిజిజు, మురళీధరన్ పార్టిసిపేట్ చేస్తారు. అంతేకాదు...పీబీడీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న ఎన్ఆర్ఐలు https://vircon24.com/16th-pbd-convention-2021/login లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు, భారత సంతతికి చెందిన వారు పాల్గొనాలని ప్రభుత్వం కోరింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష