ఎక్కువసేపు కూర్చుంటున్నారా?

- January 08, 2021 , by Maagulf
ఎక్కువసేపు కూర్చుంటున్నారా?

ఎక్కువసేపు కూర్చోవద్దు.. అరగంటకో గంటకోసారి లేవండి..అని ఎంతగా చెప్పినా చాలామంది సీట్లోంచి లేవరు. అయితే దాని ఫలితం ఆరోగ్యంమీద తీవ్రంగానే ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఎం.డి. అండర్సన్‌ కేన్సర్‌ సెంటర్‌కు చెందిన నిపుణులు.

చురుకుదనం ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా కేన్సర్‌ బారిన పడాల్సి ఉంటుందట. ఎక్కువసేపు కూర్చునేవాళ్లలో 82శాతం మంది కేన్సర్‌ బారిన పడుతున్నట్లు వీళ్ల పరిశీలనలో తేలిందట.

ఇందుకోసం నలభై ఐదేళ్లు దాటిన ముప్ఫై వేలమందిని ఎంపిక చేసి ఐదేళ్లపాటు వాళ్ల ఆరోగ్యాన్ని గమనిస్తూ వచ్చారట. అందులో కొందరికి కూర్చునే సమయంలో అరగంట తగ్గించి, ఆ సమయంలో వ్యాయామం చేయించారట.

అందులోనూ సైక్లింగ్‌ అయితే కేన్సర్‌ వచ్చే ప్రమాదం 31శాతం, నడక అయితే 8శాతం తగ్గనట్లూ గుర్తించారు.

అంతేకాదు, వాళ్లలో కదలకుండా కూర్చునే మూడువందల మంది మరో ఐదేళ్ల తర్వాత కేన్సర్‌తో మరణించారట. అందుకే ప్రతి గంటకీ లేచి ఓ ఐదునిషాలు నడవడం, మెట్లు ఎక్కడం చేస్తే మంచిదని చెప్పుకొస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com