'డీ43' షూటింగ్ ప్రారంభం
- January 08, 2021
చెన్నై:తమిళ, తెలుగు రాష్ట్ర ప్రజలకు హీరో ధనుష్ పేరు పరిచయం అక్కర్లేదు. తనదైన కథలతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ధనుష్ సినిమా అంటే కొత్తగా ఉంటుందని ప్రేక్షకుడు భావిస్తాడు. అయితే ధనుష్ తుల్లువాదో ల్లమాయి అనే సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తన నటన కథల ఎంపికతో స్టార్ హీరోగా ఎదిగాడు. హాలీవుడ్ సైతం ధనుష్‌తో చేసేందుకు మొగ్గు చూపుతోంది. అయితే ధనుష్ నూతన చిత్రం డీ43 నేడు పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ను ప్రారంభించుకుంది. ఈ సినిమా థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఇందులో ధనుష్ సరసన మాళవికా మోహనన్ నటించనుంది. ఈ థ్రిల్లర్ సినిమాని కార్తిక్ నారెన్ తనదైన దర్శకత్వంతో రూపొందించనున్నాడు. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా చేశారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా వారి అంచనాలను ఏమేరకు అందుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







