రేపట్నుంచి యూఏఈ-ఖతార్ కు అన్ని రకాల రవాణా సదుపాయాల పునరుద్ధరణ...

- January 08, 2021 , by Maagulf
రేపట్నుంచి యూఏఈ-ఖతార్ కు అన్ని రకాల రవాణా సదుపాయాల పునరుద్ధరణ...

యూఏఈ:ఖతార్ తో యూఏఈ దౌత్య సంబంధాల పునరుద్ధరణ తర్వాత..ఎప్పుటికప్పుడు సానుకూల నిర్ణయాలతో స్నేహ వైఖరిని చాటుతున్నాయి ఇరు దేశాలు. యూఏఈకి వ్యతిరేకంగా నమోదు చేసిన లీగల్ కేసులను రద్దు చేస్తున్నట్లు ఖతార్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే మరో కీలక ప్రకటన వెలువడింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఖతార్ తో అన్ని రకాల రవాణా సదుపాయాలను పునరుద్ధరిస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. వాయు, జల, భూ మార్గాల ద్వారా ట్రాన్స్ పోర్ట్ కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం రేపట్నుంచి(శనివారం) అమలులోకి రానుంది. ఈ మేరకు నౌక రవాణా, విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, బహ్రెయిన్ 2017 నుంచి ఖతార్ తో దౌత్య సంబంధాలతో పాటు అన్ని రకాల సహాయ సహాకారాలను తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే..అమెరికా ఆధ్వర్యంలో అల్ ఉలా డిక్లరేషన్ సంతకాల తర్వాత ఖతార్ తో తిరిగి స్నేహబంధం పెంపొందించుకునేలా పలు స్నేహశీల నిర్ణయాలు తీసుకుంటోంది యూఏఈ. ఇందులో భాగంగానే రవాణా సర్వీసులను పునరుద్ధిరంచినట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఖతార్ తో తాము ఎంతో సానుకూల దృక్పధంతో ముందుకు వెళ్తున్నామని వివరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com