ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది శిశువులు మృతి
- January 09, 2021
మహారాష్ట్రలో ఘోర అగ్రప్రమాదం 10 మంది శిశువుల ప్రాణాలు తీసింది... ఈ ఘటన భండారా జిల్లా ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున జరిగిన జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భండారా జిల్లా ఆసుపత్రిలోని న్యూ బోర్న్ కేర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో... ఎన్‌సీయూలో మొత్తం 17 మంది చిన్నారులుండగా... వారిలో ఏడుగురిని రక్షించగలిగారు.. కానీ, అప్పటికే 10 మంది మృత్యువుఒడికి చేరారు.. అయితే, ఉన్నట్టుండి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మంటలు చెలరేగాయి... మొదట పొగ రావడాన్ని గుర్తించిన నర్సు... మిగతా సిబ్బందికి, అధికారులకు సమాచారం ఇచ్చింది... వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు.. కానీ, అప్పటికే 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







