'కోబ్రా' టీజర్ విడుదల
- January 09, 2021
చెన్నై:తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు తెలుగు నాట కూడా మంచి మార్కెట్ ఉంది. విక్రమ్ సినిమా అంటే చాలా మంది ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం విక్రమ్ ఓ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కోబ్రా పేరును పెట్టారు. ఇందులో విక్రమ్ మాథమెటిక్స్ జీనియస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పథాన్ కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో ప్రపంచంలో ఏ సమస్యకైనా మాథమెటికల్ లేదా లాజికల్‌గా కానీ సమాధానం కచ్చితంగా ఉంటుందని అంటుంటాడు. అటువంటిది ఓ బిజినెస్ దిగ్గజం కారణంగా పెద్ద సమస్యలో చిక్కుకుంటాడు. అందులో నుంచి ఎలా బయటపడ్డానేది కథ. అయితే టీజర్ మాత్రం ఎంతో గొప్పగా తయారు చేశారు. ఈ సినిమా డిమాంటీ కాలనీ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్‌లో తెరకెక్కతోంది. అంతేకాకుండా ఇందులో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ఇర్ఫాన్ పథాన్ కూడా అద్భుతంగా నటించాడు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు