ట్రంప్‌పై చర్యలకు సిద్ధం కండి.. చట్టసభ సభ్యులకు స్పీకర్ పెలోసి పిలుపు
- January 10, 2021
వాషింగ్టన్: వచ్చే వారం వాషింగ్టన్ రావడానికి సిద్ధంగా ఉండండి.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను దింపేద్దాం అని అమెరికా చట్టసభ సభ్యులకు లేఖ రాశారు స్పీకర్ నాన్సీ పెలోసీ. అభిశంసన ద్వారా ట్రంప్‌ను దింపుతారా లేక మరో విధంగానా అని ఆమె స్పష్టంగా చెప్పకపోయినా.. క్యాపిటల్‌పై దాడికి ఏదో ఒక రకంగా ట్రంప్‌ను బాధ్యుడిని చేయాలని పెలోసీ భావిస్తున్నారు. మన ప్రజాస్వామ్యంపై దాడికి దిగిన వాళ్లను కచ్చితంగా బాధ్యులను చేయాలి. ఈ పని అధ్యక్షుడే చేయించారనీ అందరికీ తెలియాలి అని ఆ లేఖలో పెలోసీ స్పష్టం చేశారు. ట్రంప్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన పెలోసీ.. అలా చేయకపోతే అభిశంసన తప్పదన్న సంకేతాలు పంపించారు. ట్రంప్‌ను అభిశంసించాల్సిందే అంటూ డెమొక్రాట్లు పట్టుబడుతున్నారు. తాను రాజ్యాంగ నిపుణులలు, చట్ట సభ సభ్యులతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటానని, అయితే వచ్చే వారం మాత్రం మరోసారి వాషింగ్టన్‌కు రావడానికి సిద్ధంగా ఉండాలని ఆ లేఖలో పెలోసీ చెప్పారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







