సినారె పాటకు పట్టాభిషేకం
- January 12, 2021
అమెరికా గానకోకిల శారద ఆకునూరి నిర్వహణలో, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖా సహకారంతో వంశీ ఇంటర్నేషనల్ అమెరికా-ఇండియా మరియు యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్, లండన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఐదవ ప్రపంచ వంశీ సంగీత సాహిత్య సమ్మేళనంలో 58 ఆణిముత్యాల్లాంటి సి నారాయణ రెడ్డి పాటలతో "సి నా రె పాటకు పట్టాభిషేకం" అద్భుతంగా నిర్వహించారు..
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వర్ణ యుగ ప్రజా నటి కళా భారతి డాక్టర్ జమునా రమణారావు మాట్లాడుతూ ఇలా అన్నారు..
"పద్మభూషణ్, జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి గేయ రచయితగా అడుగిడి 58 సంవత్సరాలు అయిన సందర్భంగా లిటిల్ మ్యుజిష్యన్స్ అకాడమీ, హైదరాబాద్ వ్యవస్థాపకులు కె.రామాచారి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా వున్న వారి శిష్యులు, సి నా రె రచించిన పాటలను ఆలపించి ఆ మహా కవికి ఘన నివాళి అర్పించటం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు జరిగిన పట్టాభిషేకంగా భావిస్తున్నాను.. గులేబకావళి కధ చిత్రంలో సి నా రె వ్రాసిన "నన్ను దోచుకుందువటే" తొలి గేయానికి తాను అభినయించడం మరపురాని మధురమైన అనుభూతిని, ఇప్పటికీ ఆ గానాన్ని పాడని గాయనీ గాయకులు ఉండరనీ సంగీత విభావరి వుండదనీ సినారెను ఆమె ప్రశంసించారు..
"తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళలకు ఇస్తున్న ప్రాధాన్యత మరువ లేనిదని" అంటూ ముఖ్యమంత్రి KCR ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు..
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, మామిడి హరికృష్ణ , ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు , ప్రముఖ సినీ నేపధ్య గాయకులు G.ఆనంద్ , ప్రముఖ సినీ గేయ రచయితలు సిరాశ్రీ మరియు రామజోగయ్య శాస్త్రి పాల్గొని వారి అమృత తుల్యమైన సందేశాలను అందించారు..
ఈ కార్యక్రమాన్ని డాక్టర్ V. P కిల్లి, యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్, లండన్, వంశీ సంస్థల వ్యవస్థాపకులు డా.వంశీ రామరాజుగారు మరియు ఆ సంస్థల మానేజింగ్ ట్రస్టీ సుంకరపల్లి శైలజ నిర్వహించారు..
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష