కవలల మృతి: వైద్యుడికి జైలు శిక్ష
- January 13, 2021
బహ్రెయిన్‌లో ఓ వైద్యుడిని జైలుకు పంపారు. కవలల మృతికి వైద్యుడు కారణమని తేలడంతో ప్రధాన నిందితుడైన డాక్టరుకి మూడేళ్ళ జైలు శిక్ష విధించారు. ఈ కేసులో మరో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష అలాగే 1,000 దిర్హాముల జరీమానా విధించింది న్యాయస్థానం. కేసు వివరాల్లోకి వెళితే, చిన్నారులు పుట్టిన వెంటనే.. వారు చనిపోయినట్లుగా డాక్టరు చెప్పారననీ, ఆ మృతదేహాల్ని ఖననం చేసేందుకు తీసుకెళ్ళగా, ప్రాణాలతోనే ఆ చిన్నారులు వున్నట్లు కనుగొన్నామనీ, వెంటనే ఆసుపత్రికి తరలించగా, అందులో ఓ చిన్నారి తుది శ్వాస విడిచిందనీ, మరో చిన్నారి వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం జరిగిందని విచారణలో తేలింది. ప్రీ మెచ్యూర్డ్ బేబీస్‌కి వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వైద్య చికిత్స అందించి వుంటే ఇద్దరూ బతికే అవకాశం వుండేదని నిపుణుల కమిటీ తేల్చింది. మెడికల్ నెగ్లిజెన్స్ కింద నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష