ఆ వలసదారులకు కొత్త జాబ్ వీసా తప్పనిసరి

- January 13, 2021 , by Maagulf
ఆ వలసదారులకు కొత్త జాబ్ వీసా తప్పనిసరి

ఒమాన్: 180 రోజులకు పైగా దేశానికి దూరంగా వుంటోన్న వలసదారులు, తిరిగొ కొత్త జాబ్ వీసా పొందితేనే, దేశంలోకి వారికి ప్రవేశం వుంటుందని అథారిటీస్ పేర్కొన్నాయి. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సివిల్ ఏవియేషన్ అథారిటీ ద్వారా ఆయా ఎయిర్ లైన్స్‌లకు ఈ మేరకు సర్క్యులర్ని పంపించారు. కాగా, డిపెండెంట్ వీసా కలిగినవారికి ఈ నిబంధన వర్తించదు. వారి రెసిడెన్సీ వీసా గడువు తీరితే, వారికి దేశంలోకి ప్రవేశం వుండదు. 6 నెలలకు పైగా ఇతర దేశాల్లో వుండిపోయిన రెసిడెంట్స్, తమ ఎంప్లాయర్‌ని సంప్రదించి, కొత్తగా జాబ్ వీసా పొందడానికి ఆస్కారం వుంది. ఈ వ్యవహారంపై మరింత స్పష్టత అదికార వర్గాల నుంచి రావాల్సి వుందని ఎయిర్ లైన్స్ సంస్థలు పేర్కొంటున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com