సీరం తరువాత ఇక భారత్ బయో టెక్, దేశంలోని వివిధ నగరాలకు తరలిన కొవాగ్జిన్ వ్యాక్సిన్
- January 13, 2021
భారత్ బయో టెక్ సంస్థ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ బుధవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి రవాణా అయింది. ఢిల్లీతో బాటు దేశంలోని సుమారు 10 నగరాలకు ఈ వ్యాక్సిన్ ని తరలించారు. మొదట ఎయిరిండియా విమానంలో ఢిల్లీకి కొవాగ్జిన్ బాక్సులు వెళ్లగా ఆ తరువాత వివిధ ట్రక్కుల్లో ఆయా నగరాలకు రవాణా చేశారు. 80.5 కేజీల బరువైన మూడు బాక్సులను తొలి కన్ సైన్ మెంట్ లో ఢిల్లీ నగరానికి తరలించినట్టు భారత్ బయో టెక్ కంపెనీ వర్గాలు తెలిపాయి. బెంగుళూరు, పాట్నా, జైపూర్, లక్నో తదితర సిటీలకు ఈ వ్యాక్సిన్ వెళ్ళింది .55 లక్షల కొవాగ్జిన్ డోసులు, సీరం వారి 1.1 కోట్ల కొవిషీల్డ్ డోసులను తాము ప్రొక్యూర్ చేసినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు వ్యాక్సిన్లను అత్యవసర వినియోగం కోసం భారత రెగ్యులేటరీ అనుమతించింది. భారత్ బయో టెక్ సంస్థ డోసుకు 295 రూపాయలు వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 38.5 లక్షల డోసుల్లో ఈ సంస్థ కేంద్రానికి ఉచితంగా 16.5 లక్షల డోసులను అందజేయనుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష