ప్రమాదవశాత్తు బావిలో పడిన నమిత

- January 13, 2021 , by Maagulf
ప్రమాదవశాత్తు బావిలో పడిన నమిత

గ్లామర్ హీరోయిన్ నమిత ప్రమాదవశాత్తు పాడుబడిన బావిలో పడిపోయారు. ఆమె సెల్ ఫోన్ చేతి నుండి జారి పడిబోతుండగా, దాన్ని పట్టుకోబోయి పక్కనే ఉన్న బావిలో పడిపోయారు. అది చూసిన గ్రామస్థులు ఆమెను కాపాడడానికి పరుగున వచ్చారట. ఓ మారుమూల ప్రాంతంలో జరిగిన ఈ నాటకీయ సంఘటన నేపథ్యం ఏమిటంటే..!

బాగా లావైన నమిత తరువాత బాగా బరువు తగ్గిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఆమె సన్నబడినా గతంలో వలె ఆఫర్స్ రాలేదు. దాంతో, నమిత స్వయంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తూ నటిస్తున్నారు. బెలావ్ వెలావ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఆర్ ఎల్ రవి, స్కేరియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. 

ఈ మూవీ షూటింగ్ కోసం ఓ ఫారెస్ట్ ఏరియాకు చిత్ర యూనిట్ వెళ్లడం జరిగింది. ఆ సమయంలో నమిత చేతి నుండి జారిపోయిన ఫోన్ పట్టుకోబోయి పక్కనే ఉన్న బావిలో పడ్డారు.  అది చూసిన గ్రామస్థులు ఆమెను కాపాడడానికి పరుగున వచ్చారట. ఐతే చిత్ర యూనిట్ వాళ్ళను అడ్డుకొని అది నిజం కాదు, నమిత నటిస్తున్నారని చెప్పారట. అప్పటికే ఆ విషయం పక్కనే ఉన్న టౌన్ కి పాకడంతో... అందరూ నమిత బావిలో పడ్డారని చెప్పుకున్నారట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com