మనామా:వాహనాల దిగుమతిపై దరఖాస్తుల స్క్రీనింగ్

మనామా:వాహనాల దిగుమతిపై దరఖాస్తుల స్క్రీనింగ్

మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ మరియు టూరిజం వెల్లడించిన వివరాల ప్రకారం విద్యుత్ వాహనాల దిగుమతికి సంబంధించి దరఖాస్తుల స్క్రీనింగ్ త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. కమర్షియల్ వినియోగానికి సంబంధించి ఈ చర్యలు చేపట్టనున్నారు. డొమెస్టిక్ మరియు ఫారిన్ ట్రేడ్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ  షేక్ హమాద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ, మినిస్ట్రీ ఈ మేరకు ఓ మినిస్టీరియల్ డెసిషన్ తీసుకోవాల్సి వుందని చెప్పారు. క్లీన్ ఎనర్జీ ద్వారా పర్యావరణాన్ని కాపాడే విషయమై ఇన్‌స్పెక్షన్ అండ్ మెట్రాలజీ డిపార్ట్‌మెంట్ తగు చర్యలు తీసుకుంటుందని అండర్ సెక్రెటరీ వివరించారు.

Back to Top