సంక్రాంతి కానుకగా హీరో ధనుష్ కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ విడుదల
- January 13, 2021
చెన్నై:సంక్రాంతి కానుకగా స్టార్ హీరో ధనుష్ మరో సినిమాను ప్రకటించాడు. విలక్షణ డైరెక్టర్ సెల్వరాఘవన్‌తో కొత్త సినిమా చేస్తున్నారు ధనుష్. ఇప్పటికే అయిరత్తిల్ ఒరువన్ సీక్వెల్‌గా అయిరత్తిల్ ఒరువన్2ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా.. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా ట్రాక్ ఎక్కనుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రముఖ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాను తీస్తున్నారు. "నానే వరువేన్" టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌లో కూలింగ్ గ్లాస్ ధరించారు ధనుష్.. తన వెనుక వేర్వేరు రకాల తుపాకులతో అదిరిపోయే లుక్‌లో ధనుష్ కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైందని.. త్వరలోనే సినిమాలో నటించబోయే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను ప్రకటిస్తారని టాక్ వస్తోంది. అయితే... సాయిపల్లవిని ఈ సినిమా హీరోయిన్‌గా అనుకున్నట్లు కూడా తెలుస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు