భారత్ లో పెరిగిన కరోనా కేసులు...

భారత్ లో పెరిగిన కరోనా కేసులు...

న్యూ ఢిల్లీ:భారత్ లో కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు ఈరోజు పెరిగాయి. అయితే ఇప్పటికే భారత్ లో కోటి ఐదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.తాజాగా భారత్ లో 16,946 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇదే సమయంలో.. 17,652 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,12,093 కు చేరింది.ఇందులో 1,01,46,763 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,13,603 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 198 కరోనా మరణాలు సంభవించాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,51,727 కు చేరింది అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  

Back to Top