మరమ్మతుల తర్వాత పున:ప్రారంభైన కింగ్ ఫహ్ద్ కాజ్ వే మసీదు
January 14, 2021
మనామా:కింగ్ ఫహ్ద్ కాజ్ వే మసీదు కొత్త సొగబులు సంతరించుకుంది. దాదాపు BD1.2 మిలియన్ల ఖర్చుతో చేపట్టిన మసీదు మరమ్మతులు, విస్తరణ పనులు పూర్తవటంతో మసీదు మరింత విశాలంగా, సుదరంగా మారింది. గతంలో కంటే 60 శాతం ఎక్కువ విస్తరించటంతో ప్రస్తుతం 630 మంది వరకు భక్తులు ఏకకాలంలో ప్రార్థనలు నిర్వహించుకోవచ్చు. అలాగే పార్కింగ్ స్థలాన్ని కూడా విశాలంగా చేశారు. 80 కార్లను పార్క్ చేయవచ్చు. మరమ్మతు పనులు పూర్తి కావటంతో ప్రార్థనల కోసం మసీదు ద్వారాలు తెరిచినట్లు అధికారులు వెల్లడించారు.