తెలంగాణాలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణాలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్:తెలంగాణ‌లో క‌రోనా కేసులు కొంచెం తగ్గాయి.. ఈరోజు ప్ర‌భుత్వం రిలీజ్ చేసిన క‌రోనా బులెటిన్ ప్ర‌కారం కొత్త‌గా రాష్ట్రంలో 276 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 2,90,916 కి చేరింది.  ఇందులో 2,84,849 మంది కోలుకొని దిశ్చార్జ్ అయ్యారు.  4,495 కేసులు ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు ఉన్నాయి.  ఇక‌, తాజా బులెటిన్ ప్ర‌కారం, రాష్ట్రంలో క‌రోనాతో ఒక్కరు మృతి చెందారు.  దీంతో తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,572 కి చేరింది. తాజా బులెటిన్ ప్ర‌కారం, రాష్ట్రంలో ఒక్క‌రోజులో 238 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Back to Top