శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం!

శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం!

కేరళ:శబరిమలలో ఇవాళ మకరజ్యోతి దర్శనం జరగనుంది.ఈ సందర్భంగా అయ్యప్ప సన్నిధానానికి తిరునాభరణం ఊరేగింపు చేరుకోనుంది.భారత దేశవ్యాప్తంగా లక్షల మంది అయ్యప్ప భక్తులు సంక్రాంతి పండుగ రోజు శబరిమలకు వెళ్లి ప్రత్యక్షంగా మకరజ్యోతిని దర్శించుకోవాలని భావిస్తున్నారు. మకరజ్యోతిని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు వెళ్తారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో శబరిమలలో కోవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. కోవిడ్‌ నెగటివ్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే అనుమతిస్తుండటంతో శబరిమలలో అయ్యప్పలు, భక్తుల సంఖ్య భారీగా తగ్గింది.

Back to Top