ఏ.పీ,తెలంగాణ రాష్ట్రాల్లో అంబరాన్నంటుతున్న సంక్రాంతి సంబరాలు!
- January 14, 2021ఏ.పీ,తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెలుగు లోగిళ్లు రంగవల్లులతో కలకళలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉదయాన్నే ఆడపడుచులు రంగవల్లుల వేసి సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ వెల్లివెరిస్తోంది. బంధు మిత్రులతో పల్లెలు సందడిగా కనిపిస్తున్నాయి అమ్మాయిలు పట్టు పరికిణీలు, లంగాఓణి ధరించి తెలుగింటి సంప్రదాయాన్నిచాటి చెబుతున్నారు. తెలుగువారికి అసలైన పెద్ద వేడుక సంక్రాంతి. ఎక్కడున్నా అందరూ ఒక్క చోటికి చేర్చి సందడిగా మార్చే సిసలైన పండుగ ఇది. మూడు రోజుల పండుగలో భాగంగా ఇప్పటికే భోగీ సందడి ముగిసింది. ఇక పెద్దపండగైన సంక్రాంతిని అంతా ఒక్కటై జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. పచ్చని పొలాల మాటున మంచు తెరలను చీల్చుకుంటూ దక్షణాయనం పయనించి ఉత్తరాయనం దిశగా గమనం మార్చుకునే సూర్యభగవానుడికి ప్రజలంతా స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు