వకీల్‌సాబ్ టీజర్ విడుదల

- January 14, 2021 , by Maagulf
వకీల్‌సాబ్ టీజర్ విడుదల

హైదరాబాద్:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన చిత్రం వకీల్‌సాబ్. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళుగాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ కొన్ని కిరణాల కారణంగా వాయిదా పడటంతో అభిమానులు బాధపడ్డారు. వారిని సంతృప్తి పరిచేందుకు నూతన సంవత్సర కానుకగా కొత్త లుక్‌ను విడుదల చేశారు. అయితే నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా అందరినీ అలరించేందుకు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ అడ్వకేట్‌గా కనిపించాడు. చాలా పవర్‌ఫుల్ న్యాయవాదిగా పవన్ దర్శనమిచ్చాడు. అంతేకాకుండా ‘కోటు వేసుకొని వాదించడం తెలుసు. కోటు తీసి వాయించడం తెలుసు’ అని తనదైన తరహా డైలాగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా చేస్తుంది. టీజర్‌లో శ్రుతీ హాసన్ ఎక్కడా కనిపించిలేదు. టీజర్ చూస్తుంటే మాత్రం సినిమా అభిమానుల అంచనాలను మించి ఉంటుందనిపిస్తోంది. ఈ సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కింది. పవన్ అభిమానులకు ఏం కావాలో అది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా హిందీ పింక్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కానీ తెలుగులో మాత్రం పవన్ పవర్‌కి తగ్గట్టుగా పాత్రలను డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. మరి సినిమా కూడా ఇదే స్థాయిలో అభిమానుల అంచనాలకు మించి ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com