సౌదీలో వచ్చే పదేళ్లలో 6 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులకు అవకాశం
- January 15, 2021
రియాద్:పెట్టుబుడులు పెట్టాలనుకునే వారికి సౌదీ అరేబియాలో మంచి అవకాశాలు ఉన్నాయని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. వచ్చే పదేళ్లలో 6 ట్రిలియన్ల అమెరికా డాలర్ల పెట్టుబడికి అవకాశాలు ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో వర్చువల్ విధానంలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్..తాము చేపడుతున్న ఆర్ధిక సంస్కరణలు పెట్టుబడిదారులను అమితంగా ఆకర్షించేలా ఉన్నాయని వివరించారు. విజన్ 2030లో భాగంగా కొత్త ప్రాజెక్టులపైనే మూడు ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే..ఇందులో 85 శాతం నిధులు.. సౌదీ సార్వభౌమ నిధి, ప్రజా పెట్టుబడుల నిధితో పాటు ప్రైవేట్ రంగం ద్వారా సమకూరుతాయని వెల్లడించారు. ఇక మిగిలిన పెట్టుబడులు గల్ఫ్ దేశాలు, ఇతర దేశాల ఇన్వెస్టర్ల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయని తమ లక్ష్యాలను వివరించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష